ఆశీర్వదించ బడిన వారలార – Asirvadinca Badina Varalara

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

ఆశీర్వదించ బడిన వారలార
మీరెలా బయట నిలబడి ఉన్నారు
దీవించ బడిన నా ప్రియ స్నేహితులారా
మీరెలా బయట నిలబడి ఉన్నారు
సీయోను మన నివాస స్థలమండి
యెరూషలేము మన ప్రేమించే గృహమండి||2|| ||ఆశీర్వ||
1. గుమ్మములార మీ తలలు పైకెత్తి
రారాజు వచ్చిన వేళ శుభమని చెప్పండి
ఓ ప్రజలారా విలువైన మీ వస్త్రాలు
రారాజు నడుచుటకై దారిన పరవండి
ప్రభు యేసు దీనుడై గాడిద పిల్లను ఎక్కేనుగా
ఆ మార్గమెంతో సుందరము సుందరము
రారాజు సాత్వికమూతో మన మధ్యకు వచ్చేనుగా
ఉత్సాహ ధ్వనులతో స్తుతీంచేదము|| సీయోను||
2. ఓ నేస్తమా నీ దుఖ దినములన్ని
ప్రభు యేసు నామములో విడుదల కలిగెను గా
ఓ లోకమా నిజమైన రక్షణను
నీకు అందించగా యేసు వచ్చేనుగ
ఆనంద గానాలు సీయోను లో వినపడెను
మన యాత్ర సీయోను కు చేసెదము చేసెదము
ఉత్సాహ స్వరములతో ఆయన కీర్తిని పాడెదము
భూలోకమంతయు చాటేదము ||సీయోను||