కొనియాడినా కీర్తించినా నీ ఋణము – Koniyaadina Keerthinchinaa

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

పల్లవి:
కొనియాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా?
కృపనొందినా ఈ ఘటనందునా నీకోసమే జీవించనా!
వర్ణించినా నిన్ను ప్రకటించినా జీవితమర్పించినా..
తీర్చలేను నిన్నటికి నీ ఋణం.. “2” ” కొనియాడినా “
చరణం:
పాపము నిండిన నా బ్రతుకులోన నిన్ను అవమాన పరిచేన నా చేతలతో నిన్ను..
సిలువవేసి గాయపరిచాను..
నిన్ను త్రోసి నేను నడిచాను.. పరిహారపు బలిగా నా జీవముకై నీవు ..
అన్ని భరియించి నా దోషము బాపావు చేరదీసి గాయము కట్టావు…
చెంతచేరి చింతను తీర్చావు… ” వర్ణించిన “
చరణం:
అవధులన్ని దాటి నీవు జగతిలోన మాకై నీతి దారిగా మారి పరమునకై మమ్ము..
చేర్చుటకు మార్గం అయ్యావు…
నేను నడుచుటకు దీపము అయినావు…
ఆర్పలేని ప్రేమ జ్వాల హృదయములో నింపి..
ఆత్మల రక్షించుటకై మమ్ము సాగనంపి.. ఆధరించె ఆత్మనిచ్చినావు …
నా ఆత్మబంధు నీవే అయినావు “వర్ణించిన” “కొనియాడినా”