Krupagala Yesayya Lyrics

Written / sung by

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

కృపగల యేసయ్య రక్షించినావయ్యా
నీ కృపలేనిదే ఒక క్షణమైనా ఊహించలేనయా 2
అ ప: నీ కృప లేనిదే నేను బ్రతుకలేనాయా
నీ కృప నాతో ఉంటే అంతే చాలయా 2
1. నేనూ క్షేమముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ప్రమాదాలు ఎన్నో తప్పించినది
కేవలం నీదు కృప మాత్రమే
నాలో ఏమీ లేదయా….
యోగ్యతా అసలే కాదయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప |
2. నే ఆరోగ్యముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
వ్యాధి బాధలలో తోడై ఉండినది
కేవలం నీదు కృప మాత్రమే
నా బలమూ ఏమీ లేదయా
బంధుబలగమూ కానే కాదయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప |
3. నేను నీ సేవలో ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ఎన్నో శోధనలు నను కృంగదీసినా
ఘనపరిచినది నీదు కృప మాత్రమే
అర్హత నాకు లేదయా
అభిషేకం నీదేనయా
కృపయే కృపయే నీ కృపయే 2 |అ ప |
Krupagala Yesayya Lyrics in English