Neevu Thappa Dhikkedaya song lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నలిగిన నా బ్రతుకులో – ఎన్నో శోధనలు
ఇరుకులు ఇబ్బందులు – నను కృంగజేయునప్పుడు
పాపపు శాపము – నను వెంటాడినపుడు
శత్రువు ఉచ్చుకు – నేను బంధినైనప్పుడు
దేవా నీవే సహాయము చేయువడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో [2]
1. వేదన బాధతో నే ఒంటరైనప్పుడు
బ్రతుకు మీద ఆశలే నే కోల్పోయినప్పుడు
ఓదార్పు కరువై నే ఏడ్చినప్పుడు
శత్రువే నను చూసి నవ్వినప్పుడు. |దేవా|
దేవా దేవా
2. ఎవరున్నారు దేవా
ఎవరున్నారు నాకు నీవు తప్ప ఈ లోకములో
ఎవరున్నారు. |2| |దేవా|
దేవా నీవే సహాయము చేయువడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో
దేవా నీవే సమాధానము కలుగజేయువాడవు
దేవా నీవు తప్ప ఎవరూ నాకు ఈ లోకములో
దేవా నీవే ఆరోగ్యము నిచ్చువాడవు నాకు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో
దేవా నీవే ఆశీర్వాదము కలుగజేయువాడవు
దేవా నీవు తప్ప ఎవరు నాకు ఈ లోకములో