Paramunu Vidichaave Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

పరమును విడిచావే, నీవు నన్ను చేరావే
నేను పాపినని తెలిసి, నాకై ప్రాణము ఇచ్చావే
నీవు నన్ను ప్రేమించావయ్యా, నాకంత అర్హత లేదయ్యా
నేను పాపములో పుట్టి, నా పాపములో పెరిగి,
నిన్ను నేనెరుగ, నీ రక్షణను ఎరుగ.
నీవు నన్ను వెదుకివచ్చావే, నీ రక్షణను నాకు వరముగా ఇచ్చావే.
నేను అనాథ కాదని, నన్ను సొంతము చేసుకొని,
నీవే తండ్రిగా నిలబడి, నాకు అర్హతనిచ్చావే.
నీవే నాకై వస్తానన్నావే, నాకొక స్థలమును నీవు సిద్ధము చేసావే.
నీవు నన్ను ప్రేమించావయ్యా, నాకంత అర్హత లేదయ్యా
నీవు నన్ను వెదుకివచ్చావే, నీ రక్షణను నాకు వరముగా ఇచ్చావే
నీవే నాకై వస్తానన్నావే, నాకొక స్థలమును నీవు సిద్ధము చేసావే