యుగములు నీవై – Yugamulu Neevai

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

by Late. Smt. Bontha Prema Latha Lydia and sung by Srisha Vijaysekhar
యుగములు నీవై జగములనేలే
మా శ్రీ యేసువా
నీ గానమున్ నే చేసెదన్
నూతన నాదముతో
అనుదిన స్తుతులన్ అర్పింతును
పశువుల పాక రాక విశ్వానికి రక్షగా
వసంతం నిండగా
విమోచనం విశ్వాసికి
ఈవిగ నిచ్చితివి
విరివిగా స్తోత్రముల్ చెల్లింతును
నీ ఆజ్ఞ దీపముగను ఉపదేశము వెలుగుగా
ఉపకారం చేయగా
ఉత్సాహ సంతోషంబులు
నిశ్చయముగ ఎద నిండే
నిత్యము నిన్ను స్తుతింతును
కరుణా కటాక్షములను కిరీట ముంచగా
కదిలే నీ వత్సరం
కలిగించు హృదయం మేలుతో
కడవరకు కాపాడు
కల్వరి నాధా కీర్తింతును